గూగుల్ అసిస్టెంట్ ఫీచ‌ర్‌తో విడుద‌లైన లెనోవో స్మార్ట్ క్లాక్


Wed,January 9, 2019 03:37 PM

లెనోవో కంపెనీ.. గూగుల్ అసిస్టెంట్ ఫీచ‌ర్ క‌లిగిన స్మార్ట్ క్లాక్‌ను ఇవాళ విడుద‌ల చేసింది. అమెరికాలోని లాస్ వెగాస్‌లో జ‌రుగుతున్న క‌న్‌జ్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ షో (సీఈఎస్‌) 2019లో లెనోవో ఈ క్లాక్‌ను ప్ర‌ద‌ర్శించింది. ఇందులో గూగుల్ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేసినందున దీంతో ఇంట్లోని స్మార్ట్ ప‌రిక‌రాలను కంట్రోల్ చేయ‌వ‌చ్చు. వాయిస్‌, ట‌చ్ కంట్రోల్స్‌తో ఈ క్లాక్ ప‌నిచేస్తుంది. ఇందులో 4 ఇంచ్ ఐపీఎస్ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్లాక్‌తో యూజ‌ర్లు త‌మ గ్యాడ్జెట్ల‌ను వాడే స‌మ‌యాన్ని త‌గ్గించుకుని నిద్ర స‌రిగ్గా పోవ‌చ్చు. ఇంట్లో ఉండే స్మార్ట్ లైట్ల‌ను ఈ క్లాక్‌తో డిమ్ చేయ‌వ‌చ్చు. అలాగే స్మార్ట్ స్పీక‌ర్ల‌ను ఈ క్లాక్‌కు క‌నెక్ట్ చేసుకుంటే దాంతో పాట‌లు కూడా విన‌వ‌చ్చు. ఈ క్లాక్‌కు యూఎస్‌బీ పోర్ట్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని చార్జింగ్ కోసం వాడాల్సి ఉంటుంది. అలాగే 6 వాట్ల సామ‌ర్థ్యం ఉన్న ఒక చిన్న స్పీక‌ర్‌ను ఈ క్లాక్‌లో ఏర్పాటు చేశారు. దీనికి డాల్బీ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. లెనోవో స్మార్ట్‌క్లాక్ గూగుల్ క్రోమ్ క్యాస్ట్‌తో స‌హా సుమారుగా 1వేయి కంపెనీలు త‌యారు చేసిన 10వేల స్మార్ట్ ప‌రిక‌రాల‌కు క‌నెక్ట్ అవుతుంది. రూ.5,634 ధ‌ర‌కు ఈ క్లాక్ వ‌చ్చే వేస‌వి కాలంలో యూజ‌ర్ల‌కు ల‌భ్యం కానుంది.

1279
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles