లెనోవో నుంచి ఎస్5 ప్రొ స్మార్ట్‌ఫోన్


Sat,October 13, 2018 04:17 PM

లెనోవో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎస్5 ప్రొను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనుంది. బ్లాక్, రెడ్, గోల్డ్, సిల్వర్, వైట్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదల కానుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు.

లెనోవో ఎస్5 ప్రొ ఫీచర్లు...


6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 20, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

3135

More News

VIRAL NEWS