రూ.1299కే లెనోవో హెచ్‌ఎక్స్06 యాక్టివ్ స్మార్ట్‌బ్యాండ్


Wed,July 4, 2018 09:24 PM

హెచ్‌ఎక్స్06 యాక్టివ్ పేరిట లెనోవో ఓ నూతన స్మార్ట్‌బ్యాండ్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.1299 ధరకు ఈ స్మార్ట్‌బ్యాండ్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా లభిస్తున్నది. ఇందులో 0.87 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లే, 128 x 32 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్టెప్స్, డిస్టాన్స్ ట్రాకర్, క్యాలరీ కౌంటర్, స్లీప్ ట్రాకర్, కాల్స్, నోటిఫికేషన్స్ రిమైండర్, సైలెంట్ అలారం, ఐపీ67 వాటర్ రెసిస్టెన్స్, 60 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 రోజుల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌బ్యాండ్‌ను ఆండ్రాయిడ్ 4.4 ఆపైన వెర్షన్, ఐఓఎస్ 8.0 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ టెక్నాలజీ ద్వారా ఈ బ్యాండ్ ఆయా డివైస్‌లకు కనెక్ట్ అవుతుంది. అందుకు ఆయా డివైస్‌లకు చెందిన యాప్ స్టోర్‌లలో ప్రత్యేకంగా యాప్‌ను కూడా అందిస్తున్నారు.

3863

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles