రూ.2వేలకే లెనోవో కొత్త స్మార్ట్ బ్యాండ్


Tue,April 24, 2018 05:43 PM

లెనోవో సంస్థ హెచ్‌ఎక్స్03 కార్డియో, హెచ్‌ఎక్స్03ఎఫ్ స్పెక్ట్రా పేరిట రెండు నూతన స్మార్ట్ బ్యాండ్లను ఇవాళ విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్ బ్యాండ్లు వరుసగా రూ.1,999, రూ.2299 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నాయి. వీటిని ఫ్లిప్‌కార్ట్ సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. మే 3వ తేదీ నుంచి ఈ స్మార్ట్‌బ్యాండ్లను విక్రయించనున్నారు.

లెనోవో హెచ్‌ఎక్స్03 కార్డియో స్మార్ట్‌బ్యాండ్‌లో 0.96 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లే, 128 x 32 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హార్ట్ రేట్, స్టెప్స్, డిస్టాన్స్, కెలోరీస్, స్లీప్ ట్రాకర్, కాల్ రిమైండర్స్, నోటిఫికేషన్స్, సైలెంట్ అలారం, ఐపీ 68 వాటర్ రెస్టిస్టెన్స్, 10 రోజుల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదేవిధంగా లెనోవో హెచ్‌ఎక్స్03ఎఫ్ స్పెక్ట్రా స్మార్ట్‌బ్యాండ్‌లో టీఎఫ్‌టీ ఎల్‌సీడీ కలర్ డిస్‌ప్లే, 160 x 80 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్టెప్స్, డిస్టాన్స్, కెలోరీస్, స్లీప్ ట్రాకర్, సైలెంట్ అలారం, ఐపీ 68 వాటర్ రెసిస్టెన్స్, 10 రోజుల బ్యాటరీ లైఫ్ ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ రెండు స్మార్ట్‌బ్యాండ్లను బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ టెక్నాలజీ ద్వారా ఆండ్రాయిడ్ 4.4 ఆపైన వెర్షన్ ఉన్న ఆండ్రాయిడ్ డివైస్‌లు లేదా, ఐఓఎస్ 8.0 ఆపైన వెర్షన్ ఉన్న యాపిల్ డివైస్‌లకు యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు.

4599

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles