జోర్డాన్‌లో పబ్‌జి మొబైల్ గేమ్‌పై నిషేధం..


Mon,July 8, 2019 05:33 PM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ గేమ్ పబ్‌జి మొబైల్‌ను నిషేధిస్తున్నట్లు జోర్డాన్ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఈ గేమ్‌ను ఆడుతున్నందువల్ల పిల్లలు, యువతపై ఎక్కువగా నెగెటివ్ ప్రభావం పడుతుందని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే ఈ గేమ్‌ను నిషేధిస్తున్నామని జోర్దాన్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. పబ్‌జి మొబైల్ గేమ్ వల్ల పిల్లలు, యువతలో హింసా ప్రవృత్తి పెరుగుతుందని, వారిలో ఒకర్నొకరు వేధింపులకు గురిచేసుకునే అవకాశం ఉందని అక్కడి సైకాలజిస్టులు ఇప్పటికే ఎన్నోసార్లో జోర్డాన్ ప్రభుత్వానికి తెలిపారు. ఈ క్రమంలోనే అక్కడ పబ్‌జి మొబైల్ గేమ్‌ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఈ గేమ్‌ను ఎవరూ, ఎక్కడా ఆడకూడదని అక్కడ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ గేమ్‌ను ఇప్పటికే ఇరాక్, నేపాల్‌తోపాటు మన దేశంలోని గుజరాత్ రాష్ట్రంలోనూ నిషేధించిన విషయం విదితమే..!

1102
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles