జియో సావన్‌గా మారిన జియో మ్యూజిక్


Tue,December 4, 2018 12:17 PM

రిలయన్స్ జియో తన జియో మ్యూజిక్ యాప్ పేరును జియో సావన్‌గా మార్చింది. ఈ క్రమంలో కొత్త పేరుతోపాటు ఈ యాప్‌లో మరిన్ని హంగులను చేర్చింది. డార్క్ మోడ్, జియో ట్యూన్స్ సెట్ చేసుకునే వీలు.. తదితర సదుపాయాలను ఈ నూతన యాప్‌లో అందిస్తున్నారు. అలాగే ఈ యాప్‌లో జియో కస్టమర్లకు ప్రస్తుతం 45 మిలియన్లకు పైగా పాటలు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు సావన్ ఒరిజినల్ ఆడియో షోలు, పర్సనలైజ్డ్ మ్యూజిక్ రికమెండేషన్స్ వంటి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను జియో సావన్ యాప్‌లో అందిస్తున్నారు.

జియో యూజర్లు జియో సావన్ యాప్‌లో 90 రోజుల పాటు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. అందులో యాడ్ ఫ్రీ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. అన్‌లిమిటెడ్ డౌన్‌లోడ్స్ చేసుకోవచ్చు. అలాగే 320 కేబీపీఎస్ బిట్‌రేట్‌తో హై క్వాలిటీ ఆడియో లభిస్తుంది. 3 నెలల తరువాత సాధారణ సబ్‌స్క్రిప్షన్‌కు యూజర్లు మారుతారు. అయితే జియో సావన్ ప్రొ సబ్‌స్క్రిప్షన్‌లో కొనసాగాలంటే పీరియడ్ ముగిశాక నెలకు రూ.99 చెల్లించాలి. 3 నెలలకైతే రూ.285, 6 నెలలకు రూ.550 చెల్లించాలి. పేటీఎం వాలెట్, క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈ మొత్తాన్ని గూగుల్ ప్లే ద్వారా చెల్లించాలి. దీంతో జియో సావన్ ప్రొ సేవలను యథావిధిగా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం జియో సావన్ యాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్‌లపై లభిస్తున్నది.

2926
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles