మొబైల్ ఇంట‌ర్నెట్ స్పీడ్‌లో ఇప్ప‌టికీ జియోనే టాప్‌..!


Tue,April 23, 2019 04:45 PM

టెలికాం సంస్థ రిల‌యన్స్ జియో మొబైల్ ఇంట‌ర్నెట్ స్పీడ్‌లో ఇప్ప‌టికీ అగ్ర స్థానంలోనే కొన‌సాగుతున్న‌ది. 22.2 ఎంబీపీఎస్ యావ‌రేజ్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో జియో 4జీ మొబైల్ ఇంట‌ర్నెట్ స్పీడ్‌లో అగ్ర‌స్థానంలో ఉంది. ఈ మేర‌కు టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) తాజాగా వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ట్రాయ్‌కు చెందిన మొబైల్ ఇంట‌ర్నెట్ స్పీడ్ టెస్టింగ్‌ యాప్ మైస్పీడ్‌లో యూజ‌ర్లు టెస్ట్ చేసిన ఇంట‌ర్నెట్ స్పీడ్ గణాంకాల ఆధారంగా ట్రాయ్ ఈ వివ‌రాల‌ను తెలియజేసింది. ఈ క్ర‌మంలో మార్చి నెల‌లో జియో యావ‌రేజ్‌గా 22.2 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను న‌మోదు చేయ‌గా, త‌రువాతి స్థానంలో భార‌తీ ఎయిర్‌టెల్ (9.4 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌) నిలిచింది. ఆ త‌రువాత స్థానాల్లో వ‌రుస‌గా వొడాఫోన్ (7 ఎంబీపీఎస్‌), ఐడియా (5.7 ఎంబీపీఎస్‌)లు నిలిచాయి. కాగా అప్‌లోడ్ స్పీడ్‌లో మాత్రం వొడాఫోన్ అగ్ర‌స్థానంలో నిలిచింది. 6 ఎంబీపీఎస్ గ‌రిష్ట అప్‌లోడ్ స్పీడ్‌తో వొడాఫోన్ మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, త‌రువాతి స్థానాల్లో ఐడియా (5.5 ఎంబీపీఎస్‌), జియో (4.6 ఎంబీపీఎస్‌), ఎయిర్‌టెల్ (3.6 ఎంబీపీఎస్‌)లు నిలిచాయి.

1442
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles