1000 జీబీ డేటాతో జియో బ్రాడ్‌బ్యాండ్..?


Sun,March 12, 2017 07:40 PM

మొబైల్ నెట్‌వర్క్ ద్వారా ఉచిత 4జీ డేటా, కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను ఇవ్వడంలో రిలయన్స్ జియో ఏవిధంగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఇకపై అతి త్వరలో జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలు కూడా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. మరి... ఆ సేవలతో యూజర్లకు గరిష్టంగా లభించనున్న ఇంటర్నెట్ డేటా ఎంతో తెలుసా.? అక్షరాలా 1000 జీబీ..! అవును, మీరు వింటున్నది నిజమే..! నెలకు 1000 జీబీ డేటా వరకు అందించే ప్లాన్‌ను జియో తన బ్రాడ్‌బ్యాండ్ సేవ ద్వారా అందుబాటులోకి తేనున్నట్టు తెలిసింది.

1 జీబీపీఎస్ స్పీడ్‌తో నెలకు 100 జీబీ వరకు ఉచిత డేటా మొదలుకొని 10 జీబీపీఎస్ స్పీడ్‌తో నెలకు గరిష్టంగా 1000 జీబీ వరకు డేటా ఇచ్చేలా జియో బ్రాడ్ బ్యాండ్ సేవలను తీసుకురానున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే జియో తన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ముంబై, పూణెలలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నది. కొందరు యూజర్లకు ఇప్పటికే ఉచితంగా ఈ సేవలను జియో అందిస్తోంది. ఈ క్రమంలో వారు తమకు జియో బ్రాడ్‌బ్యాండ్ ద్వారా వస్తున్న నెట్ స్పీడ్ వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. అయితే జియో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అధికారికంగా ఎప్పుడు ప్రారంభమవుతాయనేది మాత్రం తెలియలేదు. జియో దీనిపై త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.

4115

More News

VIRAL NEWS