జియో ఫోన్ గిఫ్ట్ కార్డును లాంచ్ చేసిన జియో


Mon,October 29, 2018 05:43 PM

దీపావళి పండుగను పురస్కరించుకుని జియో ఫోన్ గిఫ్ట్ కార్డ్ ను జియో ఇవాళ లాంచ్ చేసింది. రూ.1095 ధరకు ఈ గిఫ్ట్ కార్డు వినియోగదారులకు లభిస్తున్నది. దీన్ని పండుగ సందర్భంగా ఎవరైనా తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఇతరులకు గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. దీంతో ఈ గిఫ్ట్ కార్డు అందుకున్న వారు తమ వద్ద ఉన్న ఏదైనా పాత 2జీ/3జీ/4జీ ఫోన్‌ను ఎక్స్‌చేంజ్ చేసి జియో ఫీచర్ ఫోన్‌ను పొందవచ్చు. దీంతో రూ.501 మొత్తం ఆ కార్డులో తగ్గించబడుతుంది. ఇక మిగిలిన రూ.594 మొత్తానికి సదరు ఫోన్‌లో 6 నెలల విలువ గల రీచార్జి ప్యాక్‌ను ఇస్తారు. రూ.99 నెలవారీ ప్లాన్ ప్రాతిపదికన ఆ మొత్తం వినియోగించబడుతుంది. రూ.99 ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 500 ఎంబీ డేటా, 300 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. దీంతోపాటు మరో 6 జీబీ అదనపు డేటాను ఉచితంగా అందిస్తారు. రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన ఈ జియో ఫోన్ గిఫ్ట్ కార్డులను వినియోగదారులు అమెజాన్ లేదా రిలయన్స్ డిజిటల్ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

7804
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles