జియో ఫోన్ 2 కు అద్భుతమైన స్పందన.. తరువాతి ఫ్లాష్ సేల్ ఎప్పుడంటే..?


Thu,August 16, 2018 03:09 PM

టెలికాం సంస్థ రిలయన్స్ జియోకు చెందిన జియో ఫోన్ 2 కు వినియోగదారుల నుంచి భారీ ఎత్తున స్పందన లభించింది. ఈ ఫోన్‌కు గాను మొదటి ఫ్లాష్ సేల్‌ను నేటి మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించగా కేవలం 5 నిమిషాల్లోనే వినియోగదారులకు పేజ్ అండర్ మెయింటెనెన్స్ అనే ఎర్రర్ మెసేజ్ దర్శనమిచ్చింది. కాగా నేడు జియో ఫోన్ 2 ను బుక్ చేసుకున్న కస్టమర్లకు వారం రోజుల్లోగా ఆ ఫోన్లను డెలివరీ చేయనున్నారు.

ఇక జియో ఫోన్ 2 కు గాను తరువాతి సేల్‌ను ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నట్లు జియో అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ఫోన్‌లో పాత జియో ఫోన్‌తో పోలిస్తే పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు. ఫోన్ డిస్‌ప్లేతోపాటు ఫిజికల్ కీబోర్డు, డ్యుయల్ సిమ్ వంటి సదుపాయాలను జియో ఫోన్ 2 లో అందిస్తున్నారు. దీని ధర రూ.2,999 గా ఉంది. ఈ ఫోన్‌ను కొన్నవారు జియోలో ఉన్న రూ.49, రూ.99 లేదా రూ.153 ప్లాన్లలో ఏదైనా ఒక ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

10664

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles