జియోఫోన్ 2 నాలుగో ఫ్లాష్‌సేల్ ఎప్పుడంటే..?


Fri,September 7, 2018 03:24 PM

ముంబయి: రిలయన్స్ జియోకు చెందిన జియోఫోన్ 2కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే నిర్వహించిన ఫ్లాష్‌సేల్‌లో లక్షల మంది ఫోన్‌ను కొనుగోలు చేశారు. జియోఫోన్ 2 కొనుగోలు చేయాలనుకునే వారి కోసం మరో ఫ్లాష్‌సేల్ ప్రకటించింది. నాలుగో ఫ్లాష్ సేల్‌ను సెప్టెంబర్ 12న మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నట్లు సంస్థ తన అధికారిక వెబ్‌సైట్ Jio.comలో పేర్కొంది. మూడో సేల్‌ను ఈనెల 6న నిర్వహించిన విషయం తెలిసిందే. 4జీ ఫీచర్ ఫోన్ ఫిజికల్ కీబోర్డు, డ్యుయల్ సిమ్ వంటి సదుపాయాలను జియో ఫోన్ 2లో అందిస్తున్నారు. దీని ధర రూ.2,999 గా ఉంది. ఈ ఫోన్‌ను కొన్నవారు జియోలో ఉన్న రూ.49, రూ.99 లేదా రూ.153 ప్లాన్లలో ఏదైనా ఒక ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

5345

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles