దీపావళి ఆఫర్.. ఈ నెల 12 వరకు ఓపెన్ సేల్‌లో లభించనున్న జియో ఫోన్ 2..!


Mon,November 5, 2018 08:02 PM

దీపావళి పండుగ సందర్భంగా జియో ఆఫర్‌ను ప్రకటించింది. జియో ఫోన్ 2 ఫీచర్ ఫోన్‌ను నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ఓపెన్ సేల్‌లో విక్రయిస్తున్నట్లు తెలిపింది. దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకునే ఈ ఫోన్‌కు ఓపెన్ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు జియో తెలిపింది. జియో వెబ్ సైట్‌లో వినియోగదారులు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. పేటీఎం వాలెట్‌ను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.200 క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు. ఇక ఈ ఫోన్‌లో డ్యుయల్ సిమ్, కై ఓఎస్, 2.4 ఇంచ్ డిస్‌ప్లే, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, వీజీఏ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్, జీపీఎస్, ఎఫ్‌ఎం రేడియో, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లున్నాయి.

9702

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles