రేపటి నుంచే జియో ఫోన్ 2 బుకింగ్స్..!


Tue,August 14, 2018 09:28 AM

టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన జియో ఫోన్ 2కు గాను రేపటి నుంచి బుకింగ్స్‌ను ప్రారంభించనుంది. ఈ ఏడాది జూలైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో ఆ సంస్థ చైర్మన్ ముకేష్ అంబానీ జియో ఫోన్ 2పై ప్రకటన చేసిన విషయం విదితమే. అందులో భాగంగానే రేపటి నుంచి జియో ఫోన్ 2 కు గాను బుకింగ్స్‌ను ప్రారంభించనున్నారు. రూ.2,999 ధరకు ఈ ఫోన్‌ను అందివ్వనున్నారు. ఫిజికల్ కీబోర్డు, వాట్సాప్‌తోపాటు పలు ఇతర ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్‌లో కస్టమర్లకు లభ్యం కానున్నాయి.

జియో ఫోన్ 2 కు గాను జియో వెబ్‌సైట్, మై జియో యాప్‌లలో బుకింగ్స్‌ను చేసుకునేందుకు వీలు కల్పించారు. వాటిల్లో జియో ఫోన్ 2 రిజిస్ట్రేషన్ పేజీపై క్లిక్ చేసి, గెట్ నౌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం వచ్చే పేజీలో పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ ఇతర వివరాలను నమోదు చేయాలి. అయితే ఈ సారి డెలివరీ సమయంలో కాకుండా ఫోన్ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే డబ్బు చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా రూ.2,999 చెల్లిస్తే ఫోన్‌ను డెలివరీ చేస్తారు. అయితే జియో ఫోన్ 2 ను బుక్ చేసుకున్న కస్టమర్లకు ఆ ఫోన్లను ఎప్పుడు డెలివరీ చేస్తారో ఆ వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ బుక్ చేసుకున్న కొన్ని రోజుల్లోనే ఈ ఫోన్లను డెలివరీ చేయవచ్చని తెలిసింది.

రిలయన్స్ జియో ఫోన్ 2 లో 2.4 ఇంచుల డిస్‌ప్లే, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, వీజీఏ సెల్ఫీ కెమెరా, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, వీవోఎల్‌టీఈ, వీవోవైఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్, బ్లూటూత్, ఎఫ్‌ఎం రేడియో తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

8644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles