జియో మరో బంపర్ ఆఫర్.. లైవ్ టీవీ, సినిమా యాప్‌లు పీసీలో..!


Mon,December 18, 2017 12:22 PM

టెలికాం రంగంలోకి సంచలనంలా దూసుకువచ్చిన రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులకు మరింత చేరువ అయింది. ఈ క్రమంలోనే జియో కస్టమర్ల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తున్నది. అయితే కస్టమర్లకు మరిన్ని ఆఫర్లను అందించేందుకు జియో ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే జియో సినిమా, లైవ్ టీవీ యాప్‌లను పీసీ వెర్షన్‌లో అందుబాటులోకి తెచ్చింది. అంటే.. ఇప్పటి వరకు జియో సినిమా, లైవ్ టీవీ యాప్‌లు కేవలం మొబైల్స్‌లోనే అందుబాటులో ఉండగా, ఇప్పుడు వాటిని కంప్యూటర్‌లో కూడా పొందవచ్చు. అందుకు గాను యూజర్లు www.jiotv.com, www.jiocinema.com సైట్లను కంప్యూటర్‌లో ఉన్న ఇంటర్నెట్ బ్రౌజర్‌లలో ఓపెన్ చేసి ఆయా సైట్లలో యూజర్లు తమ జియో యూజర్ ఐడీ/మొబైల్ నంబర్/ఈ-మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేసి ఆ సైట్లలోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో లైవ్ టీవీ, సినిమాలను కంప్యూటర్‌లోనూ వీక్షించవచ్చు.

7584

More News

VIRAL NEWS