జియో నుంచి మ‌రో కొత్త యాప్‌.. జియో న్యూస్‌..!


Thu,April 11, 2019 07:32 PM

జియో క‌స్ట‌మ‌ర్లకు శుభ‌వార్త‌. వారి కోసం జియో కొత్త‌గా న్యూస్ యాప్‌ను ఇవాళ లాంచ్ చేసింది. ఇందులో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప‌లు ప్ర‌ముఖ వార్తా ప‌త్రిక‌లు, చాన‌ల్స్, వెబ్‌సైట్స్ నుంచి తాజా స‌మాచారం, వార్త‌లు, విశేషాలు, ఇత‌ర వివ‌రాల‌ను నిమిషాల్లో తెలుసుకోవ‌చ్చు. అలాగే ప‌లు న్యూస్ చాన‌ల్స్‌కు సంబంధించిన ప్ర‌త్యక్ష ప్ర‌సారాల‌ను, వీడియోల‌ను కూడా వీక్షించ‌వ‌చ్చు. వార్తా ప‌త్రిక‌ల‌లో వ‌చ్చే క‌థ‌నాలు, వెబ్‌సైట్ల‌లో ప్ర‌చురిత‌మ‌య్యే వార్త‌లు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, ఇత‌ర వివ‌రాల‌ను జియో న్యూస్ యాప్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌చ్చు.

జియో న్యూస్ యాప్‌లో లైవ్ టీవీని, వీడియోల‌ను వీక్షించ‌వ‌చ్చు. మ్యాగ‌జైన్ల‌ను, న్యూస్ పేప‌ర్ల‌ను చ‌ద‌వ‌వ‌చ్చు. ఈ యాప్ ప్ర‌స్తుతం 12కు పైగా భార‌తీయ భాష‌ల్లో జియో క‌స్ట‌మ‌ర్ల‌కు ల‌భిస్తున్న‌ది. ఇండియాతోపాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప‌లు దేశాల్లోని 150కి పైగా లైవ్ న్యూస్ చాన‌ల్స్‌, 800కు పైగా మ్యాగ‌జైన్లు, 250కి పైగా వార్తా ప‌త్రిక‌లు, ప్ర‌ముఖ బ్లాగ్‌లు, న్యూస్ వెబ్‌సైట్ల నుంచి స‌మాచారం ఎప్ప‌టిక‌ప్పుడు జియో న్యూస్ యాప్ ద్వారా యూజ‌ర్లు తెలుసుకోవ‌చ్చు.

జియో న్యూస్ యాప్‌లో యూజ‌ర్లు త‌మ ఇష్టాల‌కు అనుగుణంగా వార్త‌ల‌ను విభాగాల వారిగా తెలుసుకునేలా హోమ్ పేజీని సెట్ చేసుకోవ‌చ్చు. పాలిటిక్స్‌, స్పోర్ట్స్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, బిజినెస్‌, టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌, ఫ్యాష‌న్‌, కెరీర్‌, హెల్త్‌, ఆస్ట్రాల‌జీ, ఫైనాన్స్ త‌దిత‌ర విభాగాల‌కు చెందిన వార్త‌ల‌ను యూజ‌ర్లు క్ష‌ణాల్లో తెలుసుకోవ‌చ్చు. అలాగే బాలీవుడ్‌, ఫ్యాష‌న్‌, హెల్త్‌, ఆటోమోటివ్‌, టెక్నాల‌జీ, స్పోర్ట్స్ విభాగాల‌కు చెందిన తాజా వీడియోల‌ను కూడా జియో న్యూస్ యాప్‌లో చూడ‌వ‌చ్చు. దీంతోపాటు త‌మ‌కు కావ‌ల్సిన మ్యాగ‌జైన్లు, వార్తా ప‌త్రిక‌ల నుంచి వార్త‌లు, ఇత‌ర క‌థ‌నాల‌ను చ‌ద‌వ‌వ‌చ్చు.

కాగా జియో ఎక్స్‌ప్రెస్ న్యూస్‌, జియో మ్యాగ్స్‌, జియో న్యూస్ పేప‌ర్ యాప్‌ల‌ను వాడేవారు ఇక‌పై జియో న్యూస్ యాప్‌నే వాడాల్సి ఉంటుంది. ఆ యాప్‌ల యూజ‌ర్లు ఈ కొత్త యాప్‌కు ఆటోమేటిగ్గా మైగ్రేట్ అవుతార‌ని జియో తెలిపింది. జియో క‌స్ట‌మ‌ర్లు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై ఈ యాప్‌ను ఉచితంగా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇక నాన్ జియో క‌స్ట‌మ‌ర్లు 90 రోజుల ఉచిత ట్రైల్ ద్వారా జియో న్యూస్‌ యాప్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఆ త‌రువాత నెల నెలా రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

11335
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles