ఆండ్రాయిడ్‌ యూజర్లకు గుడ్ న్యూస్..!


Fri,February 22, 2019 05:47 PM

ముంబై: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం రిలయన్స్ జియో కొత్త యాప్‌ను తీసుకొస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ట్రయల్ వెర్షన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 'జియో గ్రూప్ టాక్' యాప్ సాయంతో గ్రూప్ కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఒకేసారి పదిమంది వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నవారిని రిమూవ్ చేయడం, యాడ్ చేయడం, మ్యూట్ కూడా చేసుకునే వెసులుబాటు ఉంది. లెక్చర్ మోడ్ తదితర ఫీచర్లు కొత్త యాప్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ట్రయల్ మోడ్‌లో ఉన్న యాప్ త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు జియో పేర్కొంది.

జియో సిమ్ ఉన్న ఫోన్లలో హెచ్‌డీ వాయిస్ కాలింగ్ సపోర్ట్ చేసే డివైజ్‌లలో ఈ యాప్ పనిచేస్తుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం యాప్‌ను రూపొందించారు. ట్రయల్ వెర్షన్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. జియో నంబర్ ఉన్న యూజర్లు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ''జియో టాక్ యాప్: వన్ టచ్ మల్టీ పార్టీ కాలింగ్ అప్లికేషన్'' పేరుతో జియో యూజర్ల కోసం డెవలప్ చేసింది. ఒక యూజర్ ఒకేసారి 10 మందితో కాన్ఫరెన్స్ కాల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాయిస్ కాలింగ్ చేసుకునేలా రూపొందిస్తున్నారు.

4714

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles