రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొ ఫోన్లపై జియో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్..!


Thu,February 22, 2018 11:37 AM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మీ నోట్ 5, రెడ్‌మీ నోట్ 5 ప్రొలను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లకు గాను నేడు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రత్యేకంగా సేల్ నిర్వ‌హించ‌నున్నారు. నేటి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఆ సైట్‌లో ఈ ఫోన్ల‌కు మొద‌టి సేల్ జ‌ర‌గ‌నుంది. ఈ క్రమంలోనే ఈ ఫోన్లపై జియో బంపర్ ఆఫర్‌ను అందిస్తున్న‌ది. షియోమీతో భాగస్వామ్యం అయిన జియో ఈ ఆఫర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.

షియోమీ రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొ ఫోన్లను కొన్నవారు వాటిల్లో జియో సిమ్ వేసి రూ.198 లేదా రూ.299 ప్లాన్‌లతో మై జియో యాప్‌లో రీచార్జి చేసుకుంటే వారికి రూ.2200 విలువైన ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ 44 వోచర్ల రూపంలో లభిస్తుంది. ఒక్కో వోచర్ విలువ రూ.50 ఉంటుంది. వీటిని తరువాత చేసుకునే రూ.198, రూ.299 రీచార్జిలపై వాడుకుని ఆ మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇక రూ.198 అంతకన్నా ఎక్కువ విలువ గల ప్లాన్లను రీచార్జి చేసుకుంటే కస్టమర్లకు డబుల్ మొబైల్ డేటా లభిస్తుంది. మొదటి 3 రీచార్జిలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంటే.. వినియోగదారులు రూ.198 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే ఒక్కోసారి 112 జీబీ డేటా చొప్పున మొత్తం 3 సార్లకు గాను 336 జీబీ డేటా వస్తుందన్నమాట.

3347

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles