క్యాష్ బ్యాక్ ఆఫర్ గడువు పెంచిన జియో


Sat,March 3, 2018 05:05 PM

రిలయన్స్ జియో సంస్థ తన ప్రైమ్ మెంబర్ల కోసం గతంలో మోర్ దాన్ 100% క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించిన విషయం విదితమే. కాగా ఈ ఆఫర్‌కు గడువును ఈ నెల 15వ తేదీ వరకు జియో పొడిగించింది. ఇందులో కస్టమర్ల‌కు రూ.700 వరకు విలువైన క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అయితే వారు రూ.398 లేదా ఆ పైన విలువ గల ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో 100 శాతం క్యాష్‌బ్యాక్ వ‌స్తుంది. సదరు రూ.700 క్యాష్‌బ్యాక్‌లో రూ.400కు 8 ఓచర్లు వస్తాయి. ఒక్కో ఓచర్ విలువ రూ.50 ఉంటుంది. వీటిని తదుపరి చేసుకునే రీచార్జిలపై వాడుకుని ఈ మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇక మిగిలిన రూ.300 క్యాష్‌బ్యాక్ జియో పార్ట్‌నర్స్‌ అయిన డిజిటల్ వాలెట్స్ ద్వారా యూజర్లకు లభిస్తుంది. ఫ్రీ చార్జ్, మొబిక్విక్, పేటీఎం, అమెజాన్ పే, ఫోన్ పేలలో ఈ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

5094

More News

VIRAL NEWS