వ‌చ్చేసింది.. జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్‌కు ఫేస్‌బుక్ యాప్..!


Tue,February 13, 2018 07:01 PM

జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ను వాడుతున్న క‌స్ట‌మ‌ర్ల‌కు శుభ‌వార్త‌. ఇప్పుడు ఆ ఫోన్ యూజ‌ర్ల‌కు ఫేస్‌బుక్ యాప్ తాజాగా అందుబాటులోకి వ‌చ్చింది. రేప‌టి నుంచి ఈ యాప్‌ను యూజ‌ర్లు జియో ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. దీంతో వారు జియో ఫోన్‌లోనూ ఫేస్‌బుక్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇప్ప‌టికే జియో ఫోన్‌కు గాను గూగుల్ అసిస్టెంట్ యాప్ ల‌భిస్తుండ‌గా ఆ జాబితాలోకి ఫేస్‌బుక్ యాప్ వచ్చి చేరింది. జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్‌లో ఉండే కాయ్ ఓఎస్ ఆధారంగా ఈ యాప్‌ను డెవ‌ల‌ప్ చేసిన‌ట్లు ఫేస్‌బుక్ తెలిపింది. ఇక ఈ యాప్‌లో సాధార‌ణ ఫేస్‌బుక్ యాప్‌లో మాదిరిగానే యూజ‌ర్ల‌కు సేవ‌లు ల‌భిస్తాయ‌ని ఫేస్‌బుక్ ప్ర‌తినిధి ఒక‌రు చెప్పారు.

11264

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018