రైలు ప్రయాణంలో సమస్యలా..? ఇకపై వెంటనే పరిష్కారం పొందవచ్చు..!


Sun,October 14, 2018 11:33 AM

న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) యాస్క్‌దిశ పేరిట ఓ చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో పనిచేస్తుంది. రైలు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించడం కోసమే ఈ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తెచ్చామని భారతీయ రైల్వే ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తెచ్చిన యాస్క్‌దిశ చాట్‌బాట్ ప్రయాణికులకు కస్టమర్ సపోర్ట్‌ను అందిస్తుంది. ప్రయాణికులు చాటింగ్ మాధ్యమంలో అడిగే ప్రశ్నలకు చాట్‌బాట్ సమాధానాలు ఇస్తుంది. దీన్ని పలు భారతీయ భాషల్లో త్వరలో అందుబాటులోకి తేనున్నారు. అలాగే వాయిస్ కమాండ్ల ఆధారంగా కూడా పనిచేసేలా ఈ చాట్‌బాట్‌ను తీర్చిదిద్దుతున్నారు. త్వరలోనే ఐఆర్‌సీటీసీ ఆండ్రాయిడ్ యాప్‌లో ఈ చాట్‌బాట్ సేవలు లభిస్తాయని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

సాధారణంగా రైలు ప్రయాణికులకు నిత్యం పలు సందర్భాల్లో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. దీంతో వారు వెంటనే కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదిస్తారు. అయితే అందుకు కొంత సమయం పడుతుంది. కానీ యాస్క్‌దిశ చాట్ బాట్ ద్వారా రైలు ప్రయాణికులకు ఎదురయ్యే పలు సమస్యలను త్వరగా పరిష్కరించుకోవచ్చు. దీని వల్ల ప్రయాణికులకు ఎంతో సమయం ఆదా అవడమే కాక, వారికి కలిగే ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి.

2622

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles