ఐఫోన్ X స్మార్ట్‌ఫోన్ పేలింది..!


Wed,November 14, 2018 02:54 PM

అమెరికాలోని వాషింగ్టన్ నగరంలో నివాసం ఉండే ఓ వ్యక్తికి చెందిన ఐఫోన్ X స్మార్ట్‌ఫోన్ పేలింది. అయితే ఆ వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. రాహెల్ మహమ్మద్ అనే వ్యక్తి ఈ ఏడాది జనవరిలో ఐఫోన్ X ఫోన్ కొన్నాడు. తాజాగా యాపిల్ విడుదల చేసిన ఐఓఎస్ 12.1 ఓఎస్‌ను ఫోన్‌లో అప్‌డేట్ చేస్తున్నాడు. అదే సమయంలో ఫోన్ చార్జింగ్ పెట్టి ఉంది. అప్పుడే ఫోన్ నుంచి కొద్దిగా పొగ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రాహెల్ ఫోన్ చార్జింగ్ తీసేసి ఫోన్‌ను చేతిలోకి తీసుకోగా, అది బాగా వేడిగా అనిపించింది. వెంటనే దాన్ని అతను కింద పడేయగా ఫోన్ పేలింది. ఈ విషయంపై యాపిల్ సపోర్ట్‌ను తాను సంప్రదించానని రాహెల్ చెప్పాడు. అయితే ఐఫోన్ X పేలిన విషయంపై యాపిల్ ఇంకా స్పందించలేదు. బ్యాటరీ లేదా సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగానే ఫోన్ పేలి ఉంటుందని పలువురు టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే నిజానికి యాపిల్ ఫోన్లు పేలడం చాలా అరుదుగా జరుగుతుంది. దీనిపై యాపిల్ త్వరలోనే వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

2902

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles