ఈ నెల 12న ఐఫోన్ 8 విడుద‌ల‌


Fri,September 1, 2017 03:41 PM

శాన్‌ఫ్రాన్సిస్కో: ఐఫోన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌. ఈ నెల 12న ఐఫోన్ 8 విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఆపిల్ మీడియాకు ఇన్విటేష‌న్లు పంపించింది. కొత్త‌గా నిర్మించిన స్పేస్‌షిప్ క్యాంప‌స్‌లోని స్టీవ్ జాబ్స్ థియేట‌ర్‌లో ఈ వేడుక జ‌ర‌గ‌నుంది. ఈ లేటెస్ట్ మోడ‌ల్ కోసం ఐఫోన్ ల‌వ‌ర్స్ ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. ఐఫోన్ 8తోపాటు ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 7ఎస్‌, ఐఫోన్ 7ఎస్ ప్ల‌స్ కూడా విడుద‌ల కానున్నాయి. అంతేకాదు 4కే, హెచ్‌డీఆర్ స‌పోర్ట్ చేసే కొత్త ఆపిల్ టీవీ, ఎల్‌టీఈ కేప‌బుల్ ఆపిల్ వాచ్ కూడా లాంచ్ చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఐఫోన్ 8లో కొన్ని రెవ‌ల్యూష‌న‌రీ ఫీచ‌ర్స్ ఉన్నాయి. ఈ మోడ‌ల్ నుంచి సాంప్ర‌దాయ ట‌చ్ ఐడీ ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌ను తొల‌గించారు. దీని స్థానంలో 3డీ సెన్స‌ర్స్ అమ‌ర్చి, ముఖ క‌వ‌లిక‌ల ఆధారంగా గుర్తించే ఫీచ‌ర్‌ను యాడ్ చేశారు. స్మార్ట్‌ఫోన్ల‌లో ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌ను పాపుల‌ర్ చేసి ఆపిల్‌.. ఈ కొత్త ఫీచ‌ర్‌తో ఎంత వ‌ర‌కు స‌క్సెస‌వుతుందో చూడాలి. ఇక కొత్త‌గా రానున్న మూడు మోడ‌ల్స్‌లో ఒక‌దాంట్లో ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఎల్‌సీడీ డిస్‌ప్లేస్‌తోనే ఐఫోన్స్ వ‌చ్చాయి.

ఇక దీని ధ‌ర‌పై కూడా చ‌ర్చ‌లు బాగానే న‌డుస్తున్నాయి. ఇండియాలో ఐఫోన్ 8 ధ‌ర ఎంత ఉంటుంద‌న్న‌ది ఇంకా చెప్ప‌లేదు. అయితే ఐఫోన్ 7 కంటే చాలా ఎక్కువే ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఐఫోన్ 7 ధ‌ర‌ మొద‌ట్లో రూ.72 వేల వ‌ర‌కు ఉన్న విష‌యం తెలిసిందే. కొత్త మోడ‌ల్స్ లాంచ్ త‌ర్వాత అమెరికాలో రెండు వారాల్లోగా వాటిని అందుబాటులోకి తెస్తుంది ఆపిల్‌. అదే ఇండియాలో అయితే క‌నీసం నాలుగు నుంచి ఆరు వారాలు ఆగాల్సిందే.

10592

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles