ఐఓఎస్ 11.2లో 7.5 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్


Tue,November 14, 2017 05:32 PM

యాపిల్ సంస్థ ఐఫోన్ 8, 8 ప్లస్, 10 ఫోన్లను ఈ మధ్యే విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్లు నూతన ఫీచర్లతో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రధానంగా ఐఫోన్ 10లో ఉన్న ఫేస్ ఐడీ ఫీచర్‌కు ఐఫోన్ ప్రియులు ఫిదా అయిపోయారు. అయితే ఈ మూడు ఫోన్లలోనూ క్యూఐ వైర్‌లెస్ చార్జర్లకు గాను కేవలం 5వాట్స్ పవర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఉంది. అయితే త్వరలో యాపిల్ దీన్ని 7.5 వాట్లకు పెంచనుంది. త్వరలో రానున్న ఐఓఎస్ 11.2 అప్‌డేట్ ద్వారా యూజర్లకు ఈ ఫీచర్‌ను యాపిల్ అందివ్వనుంది. దీంతో క్యూఐ వైర్‌లెస్ చార్జర్ల ద్వారా యూజర్లు ఐఫోన్ 8, 8ప్లస్, 10 ఫోన్‌లను 7.5 వాట్స్ సామర్థ్యంతో ఫాస్ట్‌గా చార్జింగ్ పెట్టుకోవచ్చు. 5 వాట్స్ పవర్ కన్నా 7.5 వాట్స్ పవర్‌తో ఈ ఫోన్లను త్వరగా చార్జింగ్ చేసుకునేందుకు వీలుంటుంది.

1406

More News

VIRAL NEWS