జీమెయిల్‌, గూగుల్ మ్యాప్స్‌, డ్రైవ్ సేవ‌ల‌కు అంత‌రాయం..!


Wed,March 13, 2019 01:09 PM

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్‌కు చెందిన జీమెయిల్‌, గూగుల్ డ్రైవ్‌, మ్యాప్స్ సేవ‌ల‌కు ఇవాళ కొంత స‌మ‌యం పాటు అంత‌రాయం క‌లిగింది. బార‌త కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 8.23 గంట‌ల‌కు ఈ సేవ‌ల‌కు అంత‌రాయం క‌లిగింది. త‌రువాత 11.43 గంట‌ల వ‌ర‌కు ఆ అంత‌రాయం కొన‌సాగింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, అమెరికా, యూర‌ప్‌, ఆసియా దేశాల యూజ‌ర్లు ఆయా గూగుల్ సేవ‌ల‌ను వాడుకోవ‌డంలో ఇబ్బందులు ప‌డ్డారు. అయితే ఈ అంతాయంపై వెంట‌నే స్పందించిన గూగుల్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించింది. దీంతో ప్ర‌స్తుతం ఆ సేవ‌లు యూజ‌ర్లకు య‌థావిధిగా ల‌భిస్తున్నాయి. ఈ క్ర‌మంలో గూగుల్ త‌న సేవ‌ల‌కు అంత‌రాయం క‌లిగినందుకు క్ష‌మించాల‌ని యూజ‌ర్ల‌ను కోరింది..!

1198

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles