ప్రపంచంలోనే హై కెపాసిటీ క‌లిగిన‌ మెమొరీ కార్డ్ ఇది..!


Wed,January 24, 2018 04:40 PM

యూకేకు చెందిన ఇంటెగ్రల్ మెమొరీ పీఎల్‌సీ అనే కంపెనీ ప్రపంచంలోనే అత్యధిక స్టోరేజ్ కలిగిన హై కెపాసిటీ మైక్రో ఎస్‌డీ కార్డును తాజాగా విడుదల చేసింది. దీని కెపాసిటీ 512 జీబీ. గతంలో సాన్ డిస్క్ సంస్థ 400 జీబీ కెపాసిటీ ఉన్న మైక్రో ఎస్‌డీ కార్డును విడుదల చేయగా ఇప్పుడు తాజాగా 512 జీబీ కెపాసిటీ ఉన్న మెమొరీ కార్డును ఇంటెగ్రల్ సంస్థ విడుదల చేసింది. క్లాస్ 10 స్పెసిఫికేషన్స్‌తో తయారు చేయబడిన ఈ కార్డులో డేటాను 10 ఎంబీపీఎస్ పర్ సెకండ్ స్పీడ్‌తో రైట్ చేసుకోవచ్చు. అలాగే గరిష్టంగా 80 ఎంబీపీఎస్ పర్ సెకండ్ రైట్ స్పీడ్‌ను ఈ కార్డు సపోర్ట్ చేస్తుంది. 5 సంవత్సరాల వారంటీతో ఈ కార్డు యూజర్లకు లభ్యం కానుంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ కార్డుకు విక్రయాలు ప్రారంభం కానున్నాయి. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

3632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles