రూ.7,499 కే ఇన్నెలో 1 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్


Tue,September 18, 2018 03:24 PM

మొబైల్స్ తయారీదారు ఐవూమీకి చెందిన సబ్ బ్రాండ్ ఇన్నెలో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఇన్నెలో 1 ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 5.86 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో ముందు భాగంలో ఉన్న 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాకు ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కల్పించారు. ఈ ఫోన్‌లో డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈకి సపోర్ట్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. ఇన్నెలో 1 స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, ప్లాటినం గోల్డ్, పసిఫిక్ బ్లూ, పర్షియన్ రెడ్ కలర్ వేరియెంట్లలో రూ.7,499 ధరకు వినియోగదారులకు ప్రత్యేకంగా అమెజాన్ సైట్‌లో లభిస్తున్నది.

ఇన్నెలో 1 ఫీచర్లు...

5.86 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

3399

More News

VIRAL NEWS