ఐఫాల్క‌న్ 65 ఇంచుల 4కె ఆండ్రాయిడ్ టీవీ విడుద‌ల


Thu,May 16, 2019 12:02 PM

ఐఫాల్క‌న్ కంపెనీ వీ2ఏ పేరిట ఓ నూత‌న 4కె ఆండ్రాయిడ్ టీవీని భార‌త మార్కెట్‌లో ఇవాళ విడుద‌ల చేసింది. ఈ టీవీ 65 ఇంచుల డిస్‌ప్లే సైజ్‌ను క‌లిగి ఉంది. అలాగే ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారంగా ఈ టీవీ ప‌నిచేస్తుంది. ఇందులో 64 బిట్ క్వాడ్‌కోర్ సీపీయూ, 2.5 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, గూగుల్ క్రోమ్‌క్యాస్ట్‌కు స‌పోర్ట్‌, 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు, గూగుల్ అసిస్టెంట్‌కు సపోర్ట్‌, డాల్బీ డీటీఎస్ సౌండ్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇక ఈ టీవీ ధ‌ర రూ.99,999 ఉండ‌గా.. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో విక్ర‌యిస్తున్నారు. ఈజీ ఈఎంఐల రూపంలోనూ ఈ టీవీని వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు. హెచ్‌డీఎఫ్‌సీ డెబిల్ లేదా క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగించి ఈ టీవీని కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది.

1883
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles