ఐడియా బంప‌ర్ ఆఫ‌ర్‌.. పోస్ట్‌పెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌..!


Sun,March 17, 2019 01:32 PM


టెలికాం సంస్థ ఐడియా త‌న పోస్ట్‌పెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తున్న‌ది. రూ.399 లేదా ఆపైన విలువ గ‌ల నిర్వానా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను వాడుతున్న క‌స్ట‌మ‌ర్లు ఇప్పుడు ఏడాది కాల‌వ్య‌వ‌ధి గ‌ల అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. అందుకు గాను ఐడియా పోస్ట్‌పెయిడ్ క‌స్ట‌మ‌ర్లు ఐడియా మూవీస్ అండ్ టీవీ యాప్‌ను యాప్‌స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని త‌మ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. త‌రువాత మొబైల్ నంబర్‌ను ఎంట‌ర్ చేసి ఓటీపీ ద్వారా క‌న్‌ఫాం చేయాలి. అనంతరం వ‌చ్చే అమెజాన్ ఆఫ‌ర్‌ను ఎంచుకోవాలి. దీంతో క‌స్ట‌మ‌ర్ల‌కు ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ షిప్ ల‌భిస్తుంది..!

3703

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles