రూ.227 కే కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టిన ఐడియా


Wed,June 27, 2018 08:59 PM

టెలికాం సంస్థ ఐడియా సెల్యులార్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ.227కే ఓ నూతన ప్లాన్‌ను ఇవాళ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. అలాగే రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకు 1.4 జీబీ డేటా వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణయించారు. అలాగే ఈ ప్లాన్‌లో కస్టమర్లకు మిస్డ్ కాల్ అలర్ట్స్, ఉచిత డయలర్ టోన్లను కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం ఐడియా అందిస్తున్న మిస్డ్ కాల్ అలర్ట్స్ సర్వీస్‌ను పొందాలంటే నెలకు రూ.30 చెల్లించాలి. కానీ ఈ ప్లాన్‌లో మాత్రం ఈ సేవను కస్టమర్లు ఉచితంగానే పొందవచ్చు. ఇక కాల్స్ విషయానికి వస్తే రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల ఉచిత కాల్స్ చేసుకునే వీలును ఈ ప్లాన్‌లో కల్పించారు.

3211

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles