జియో, ఎయిర్‌టెల్‌లకు పోటీగా ఐడియా కొత్త ప్లాన్..!


Sun,January 7, 2018 05:58 PM

టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌లకు పోటీగా ఐడియా ఓ నూతన ప్లాన్‌ను లాంచ్ చేసింది. రూ.93కి అందుబాటులోకి వచ్చిన ఈ ప్లాన్‌తో ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు రీచార్జి చేసుకుంటే 1జీబీ 3జీ డేటా లభిస్తుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. వీటిని రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల చొప్పున వాడుకోవచ్చు. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ 10 రోజులుగా ఉంది. అయితే జియోలో ఇదే తరహాలో రూ.98 ప్లాన్ లభిస్తుండగా ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, 140 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకు 150 ఎంబీ డేటా చొప్పున 14 రోజులకు 2.1 జీబీ డేటాను వాడుకోవచ్చు. అదే ఎయిర్‌టెల్‌లో అయితే రూ.93 ప్లాన్‌లో యూజర్లకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 1జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 10 రోజులుగా ఉంది.

13412

More News

VIRAL NEWS

Featured Articles