నూతన 4జీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను విడుదల చేసిన ఐబాల్


Mon,June 25, 2018 06:25 PM

ఐబాల్ సంస్థ 'ఇంప్రింట్ 4జీ' పేరిట ఓ నూతన 4జీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను ఇవాళ విడుదల చేసింది. రూ.18,999 ధరకు ఈ ట్యాబ్లెట్ వినియోగదారులకు లభిస్తున్నది. ఆధార్ వెరిఫికేషన్ కోసం ఉపయుక్తంగా ఉండేలా ప్రత్యేకంగా ఈ ట్యాబ్లెట్‌ను తీర్చిదిద్దారు. ఇందులో ఇంటిగ్రేటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ల్యాన్ పోర్టును ఈ ట్యాబ్లెట్ పీసీలో అందిస్తున్నారు.

ఐబాల్ ఇంప్రింట్ 4జీ ఫీచర్లు...


7 ఇంచ్ ఐపీఎస్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1024 x 600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ సిమ్, యూఎస్‌బీ ఓటీజీ, బ్లూటూత్ 4.0, ల్యాన్ పోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

2849

More News

VIRAL NEWS