వన్‌ప్లస్ 6టి పాపప్ ఈవెంట్లకు విశేష స్పందన


Tue,November 6, 2018 05:55 PM

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6టి ని గత వారం కిందట విడుదల చేసిన విషయం విదితమే. ఈ ఫోన్‌కు చెందిన అన్ని వేరియెంట్లు ప్రస్తుతం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కాగా ఈ ఫోన్ విడుదల సందర్భంగా ఈ నెల 2వ తేదీన బెంగళూరు, ముంబై, పూణె, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌లలో వన్‌ప్లస్ 6టి పాపప్ ఈవెంట్లను వన్‌ప్లస్ నిర్వహించింది. వీటికి వన్‌ప్లస్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వన్‌ప్లస్ నూతనంగా విడుదల చేసిన వన్‌ప్లస్ 6టి ఫోన్‌ను ఈ పాపప్ ఈవెంట్లలో యూజర్లు పెద్ద ఎత్తున అనుభూతి చెందారు. అంతేకాకుండా ఫోన్ కొనుగోలు పట్ల కూడా వారు విశేష స్పందన కనబరుస్తున్నారని వన్‌ప్లస్ తాజాగా వెల్లడించింది.

వన్‌ప్లస్ 6టి ఫోన్‌లో 6.41 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.37,999 ఉండగా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.41,999 గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.45,999గా ఉంది. వన్‌ప్లస్, అమెజాన్ ఆన్‌లైన్ స్టోర్స్‌తోపాటు వన్‌ప్లస్ ఆఫ్‌లైన్ స్టోర్లు, రిలయన్స్ డిజిటల క్రోమా స్టోర్స్‌లోనూ వన్‌ప్లస్ 6టి ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.

1308

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles