ఫేస్‌బుక్‌పై భారీ జ‌రిమానా..?


Sat,January 19, 2019 05:20 PM

ప్ర‌ముఖ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ దిగ్గ‌జ సంస్థ ఫేస్‌బుక్‌కు నిజంగా ఇది పిడుగు లాంటి వార్తే. ఇప్ప‌టికే యూజ‌ర్ల‌ వ్య‌క్తిగత వివ‌రాల‌ను వారి అనుమ‌తి లేకుండా విక్ర‌యించిందనే విష‌యంపై ఫేస్‌బుక్ విచార‌ణ ఎదుర్కొంటూ అంద‌రిచే విమ‌ర్శ‌ల పాల‌వుతున్న‌ది. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో ఆ సంస్థ‌కు మ‌రో ఝ‌ల‌క్ త‌గ‌ల‌నుంది. ఆ సంస్థ‌పై అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) భారీ జ‌రిమానా విధించనున్న‌ట్లు తెలిసింది. పలు అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌లు వెలువ‌రిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం... యూజ‌ర్ల స‌మాచార గోప్య‌త నిబంధ‌న‌ల ఉల్లంఘన అంశంపై ఎఫ్‌టీసీ చేపట్టిన ద‌ర్యాప్తు చివ‌రి ద‌శ‌కు చేరుకున్న నేప‌థ్యంలో ఫేస్‌బుక్‌పై భారీ మొత్తంలో జ‌రిమానా విధించే అవకాశం ఉన్న‌ట్లు తెలిసింది.

2012లో ఎఫ్‌టీసీ సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్‌పై 22.5 మిలియ‌న్ డాల‌ర్ల జ‌రిమానా విధించ‌గా, అంతక‌న్నా ఎక్కువ‌గానే ఇప్పుడు ఫేస్‌బుక్‌పై జ‌రిమానా విధించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది. కాగా ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ కూడా గ‌తంలోనే యూజ‌ర్ల డేటా లీకైంద‌నే విష‌యాన్ని ఒప్పుకున్నారు. అమెరిక‌న్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ ముందు జుక‌ర్‌బ‌ర్గ్ హాజ‌రై డేటా లీక్ విష‌యంపై వివ‌ర‌ణ ఇచ్చారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూస్తామ‌ని తెలిపారు. ఆ త‌రువాత ఇప్పుడు మ‌ళ్లీ ఫేస్‌బుక్‌పై విధించ‌నున్న జ‌రిమానా విష‌యం మ‌రోసారి సంచ‌ల‌నం రేపుతున్న‌ది.

3887
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles