ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన హువావే వై9 2019 స్మార్ట్‌ఫోన్


Thu,January 10, 2019 02:30 PM

మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ వై9 2019ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.5 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 16, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 13, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండింటిని ఏర్పాటు చేశారు. రూ.15,990 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు అమెజాన్‌లో ప్ర‌త్యేకంగా ఈ నెల 15వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. ఈ ఫోన్‌తో రూ.2,990 విలువ గ‌ల బోట్ రాక‌ర్జ్ స్పోర్ట్స్ బ్లూటూత్ హెడ్‌సెట్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉండ‌గా, 4000 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీని ఇందులో అందిస్తున్నారు.

హువావే వై9 2019 ఫీచ‌ర్లు...


6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 400 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

2187
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles