డిసెంబర్ 5న విడుదల కానున్న హువావే నూతన స్మార్ట్‌వాచ్


Mon,December 2, 2019 03:58 PM

మొబైల్స్ తయారీదారు హువావే తన వాచ్ జీటీ2 స్మార్ట్‌వాచ్‌ను డిసెంబర్ 5వ తేదీన భారత్‌లో విడుదల చేయనుంది. ఇందులో 1.2 ఇంచ్ అమోలెడ్ టచ్ డిస్‌ప్లే, హువావే కైరిన్ ఎ1 చిప్, బ్లూటూత్ 5.1, హువావే లైట్ ఓఎస్, వాటర్ రెసిస్టెన్స్, జీపీఎస్, బ్లూటూత్ కాలింగ్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ మానిటరింగ్, 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లను ఏర్పాటు చేశారు. ఇక ఈ వాచ్‌ను వినియోగదారులు డిసెంబర్ 5 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్ ప్రారంభ ధర రూ.19,990 ఉంటుందని తెలుస్తుండగా, గరిష్ట రూ.30,990 ఉంటుందని సమాచారం.

2003
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles