హువావే టాక్‌బ్యాండ్ బి5 స్మార్ట్‌బ్యాండ్ విడుదల


Thu,July 19, 2018 03:15 PM

టాక్‌బ్యాండ్ బి5 పేరిట హువావే ఓ నూతన స్మార్ట్‌బ్యాండ్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.10,195 ధరకు ఈ బ్యాండ్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో 1.13 ఇంచ్ అమోలెడ్ టచ్ డిస్‌ప్లే, 300 x 160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, బ్లూటూత్ 4.2, హెల్త్ అసిస్టెంట్, హార్ట్ రేట్ మానిటరింగ్, యాక్టివిటీ ట్రాకర్, స్లీప్ ట్రాకర్, ఐపీ 57 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 108 ఎంఏహెచ్ బ్యాటరీ, మూడున్నర రోజుల బ్యాటరీ లైఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ బ్యాండ్‌ను ఆండ్రాయిడ్ 4.4 ఆపైన వెర్షన్, ఐఓఎస్ 9.0 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకు గాను ప్రత్యేకంగా యాప్‌ను ఆయా ప్లాట్‌ఫాంలపై అందిస్తున్నారు.

https://images.fonearena.com/blog/wp-content/uploads/2018/07/Huawei-TalkBand-B5-1.jpg

1401

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles