భారత్‌లో విడుదలైన హువావే పీ30 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌


Tue,April 9, 2019 04:28 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్‌ పీ30 లైట్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 6.15 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్‌ ర్యామ్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 9.0 పై ఓఎస్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 24, 2, 8 మెగాపిక్సల్‌ కెమెరాలు మూడు ఉండగా, ముందు భాగంలో 32 మెగాపిక్సల్‌ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను వెనుక భాగంలో అమర్చారు. రూ.19,990 ప్రారంభ ధరకు ఈ ఫోన్‌ వినియోగదారులకు ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌లో లభ్యం కానుంది. మే నెల నుంచి ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు.

హువావే పీ30 లైట్‌ ఫీచర్లు...


6.15 ఇంచ్‌ ఫుల్ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, 2312 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌, ఆక్టాకోర్‌ కైరిన్‌ 710 ప్రాసెసర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, హైబ్రిడ్‌ డ్యుయల్‌ సిమ్‌, 24, 2, 8 మెగాపిక్సల్‌ ట్రిపుల్‌ బ్యాక్‌ కెమెరాలు, 32 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 4.2 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్‌ సి, 3340 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.

1010
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles