హువావే పీ20 లైట్ స్మార్ట్‌ఫోన్ విడుదల


Sat,March 17, 2018 01:04 PM

మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ పీ20 లైట్‌ను పోలండ్ మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఏప్రిల్ మొదటి వారంలో ఈ ఫోన్ భారత మార్కెట్‌లోనూ విడుదల కానుంది. రూ.28,355 ధరకు మన దేశంలో ఈ ఫోన్ లభ్యం కానుంది. ఈ ఫోన్‌లో 5.84 ఇంచ్ సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. డిస్‌ప్లే పై భాగంలో ఐఫోన్ 10 తరహాలో నాచ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 8.0 సరికొత్త ఓఎస్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఫోన్ వెనుక భాగంలో 16, 2 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు కెమెరాలను ఏర్పాటు చేయగా, వాటి కింద ఫోన్ మధ్య భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. బ్లాక్, బ్లూ, రోజ్ గోల్డ్ రంగుల్లో స్టన్నింగ్ లుక్‌తో ఈ ఫోన్ యూజర్లకు లభ్యం కానుంది.

హువావే పీ20 లైట్ ఫీచర్లు...
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, టఫెన్డ్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ కైరిన్ 659 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

2000

More News

VIRAL NEWS

Featured Articles