హువావే నుంచి పి స్మార్ట్ 2019 స్మార్ట్‌ఫోన్


Sat,December 15, 2018 05:39 PM

మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ పి స్మార్ట్ 2019 ను త్వరలో విడుదల చేయనుంది. రూ.20,330 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు త్వరలో లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

హువావే పి స్మార్ట్ 2019 స్మార్ట్‌ఫోన్‌లో 6.21 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

హువావే పి స్మార్ట్ 2019 ఫీచర్లు...


6.21 ఇంచ్ పుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

3365
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles