4 కెమెరాలతో విడుదలైన హువావే నోవా 3ఐ స్మార్ట్‌ఫోన్


Mon,July 30, 2018 11:49 AM

మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ నోవా 3ఐ ని తాజాగా విడుదల చేసింది. బ్లాక్, ఐరిస్ పర్పుల్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.20,990 ధరకు వినియోగదారులకు అమెజాన్ సైట్‌లో ఆగస్టు 7 నుంచి లభ్యం కానుంది. ఈ ఫోన్‌కు గాను ఇప్పటికే ప్రి బుకింగ్స్‌ను కూడా ప్రారంభించారు. ఈ ఫోన్‌పై కస్టమర్లకు పలు ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. ఈ ఫోన్‌ను ప్రి బుకింగ్ చేసుకున్న వారికి రూ.1వేయి క్యాష్‌బ్యాక్‌ను ఇస్తున్నారు. ఈ ఫోన్‌ను నో కాస్ట్ ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేయవచ్చు. ఇతర ఫోన్లతో ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.2వేల వరకు అదనంగా డిస్కౌంట్ ఇస్తారు. ఈ ఫోన్‌పై జియో రూ.1200 క్యాష్‌బ్యాక్‌ను వోచర్ల రూపంలో అందిస్తున్నది. అలాగే 100 జీబీ అదనపు మొబైల్ డేటాను, రూ.3300 విలువైన పలు వోచర్లను కూడా జియో అందిస్తున్నది.

హువావే నోవా 3ఐ ఫీచర్లు...


6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ.

2052

More News

VIRAL NEWS

Featured Articles