నోవా 3 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన హువావే


Sun,July 29, 2018 04:53 PM

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ నోవా 3 ని భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.34,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఆగస్టు 7 నుంచి అమెజాన్ సైట్‌లో ప్రత్యేకంగా ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను ముందుగా ప్రీ బుకింగ్ చేసుకుంటే కస్టమర్లకు రూ.1000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. ఇతర ఫోన్లతో ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే రూ.2వేల వరకు అదనంగా డిస్కౌంట్ ఇస్తారు. ఈ ఫోన్‌పై జియో రూ.1200 క్యాష్‌బ్యాక్‌ను, 100 జీబీ అదనపు మొబైల్ డేటాను, రూ.3300 విలువైన పలు వోచర్లను కూడా అందిస్తున్నది.

హువావే నోవా 3 ఫీచర్లు...


6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

3386

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles