4జీ ఎల్‌టీఈ క‌నెక్టివిటీతో విడుద‌లైన హువావే మేట్‌బుక్ ఇ2019


Fri,April 12, 2019 11:43 AM

హువావే.. మేట్‌బుక్ ఇ2019 పేరిట ఓ నూత‌న క‌న్వ‌ర్ట‌బుల్ పీసీని ఇవాళ విడుద‌ల చేసింది. ఇందులో 4జీ ఎల్‌టీఈకి స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. స్నాప్‌డ్రాగ‌న్ 850 ప్రాసెస‌ర్‌ను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ పీసీని ట్యాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్‌గా కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. డాల్బీ అట్మోస్ ఫీచ‌ర్‌ను ఇందులో అందిస్తున్నారు. 256/512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో ఈ పీసీ వినియోగ‌దారుల‌కు రూ.41వేల ప్రారంభ ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు త్వ‌ర‌లో ల‌భ్యం కానుంది. ఇందులో 12 ఇంచ్ డిస్‌ప్లే, 160 డిగ్రీస్ వ్యూయింగ్ యాంగిల్‌, యాంటీ ఫింగ‌ర్ ప్రింట్ కోటింగ్‌, 8జీబీ ర్యామ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, హువావే ఎం పెన్‌, 10 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

824
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles