రేపు విడుదల కానున్న హువావే మేట్ 20 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు


Mon,October 15, 2018 06:06 PM

హువావే.. మేట్ 20 సిరీస్‌లో నూతన స్మార్ట్‌ఫోన్లను రేపు లండన్‌లో విడుదల చేయనుంది. మేట్ 20, మేట్ 20 ప్రొ, మేట్ 20ఎక్స్ పేరిట ఈ ఫోన్లు విడుదల కానున్నాయి. ఈ మూడింటిలో అధునాతన హై సిలికాన్ కైరిన్ 980 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఈ మూడు ఫోన్లలోనూ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరాలు ఉంటాయి. భారత కాలమానం ప్రకారం రేపు సాయంత్రం 6.30 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుండగా, అందులో ఈ ఫోన్లను లాంచ్ చేస్తారు.

మేట్ 20 సిరీస్ ఫోన్ల ధరల విషయానికి వస్తే.. మేట్ 20 ధర రూ.68వేల వరకు ఉంటుందని తెలుస్తుండగా, మేట్ 20 ప్రొ ధర రూ.92వేలు ఉంటుందని తెలుస్తుంది. మేట్20ఎక్స్ ధర వివరాలు తెలియరాలేదు. మేట్ 20 స్మార్ట్‌ఫోన్‌లో 6.43 ఇంచుల డిస్‌ప్లే, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఉండవచ్చని సమాచారం. అలాగే మేట్ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో 6.39 ఇంచుల డిస్‌ప్లే, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఉంటాయని తెలిసింది. ఇక మేట్20ఎక్స్ ఫీచర్ల వివరాలు తెలియలేదు.

2443

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles