మేట్ 20, మేట్ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసిన హువావే


Sat,October 20, 2018 04:46 PM

మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్లు మేట్ 20, మేట్ 20 ప్రొలను ఇటీవలే విడుదల చేసింది. మేట్ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో 6.39 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేయగా, మేట్ 20 స్మార్ట్‌ఫోన్‌లో 6.53 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. రెండింటిలోనూ కైరిన్ 980 చిప్‌సెట్‌ను అమర్చారు. దీని వల్ల ఫోన్లు వేగవంతమైన ప్రదర్శనను ఇస్తాయి. రెండింటిలోనూ ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. మేట్ 20 ప్రొ లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేయగా, ఈ ఫోన్‌లో 3డీ ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు. అలాగే 3డీ లైవ్ ఎమోజీ ఫీచర్‌ను కూడా ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

మేట్ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో 40, 20, 8 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న మూడు కెమెరాలను వెనుక భాగంలో అమర్చారు. ఈ ఫోన్లలో కొత్తగా ఎన్‌ఎం కార్డ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అంటే.. సాంప్రదాయ మైక్రో ఎస్‌డీకార్డుల కన్నా ఈ ఎన్‌ఎం కార్డు స్లాట్ సైజ్ ఇంకా చిన్నదిగా ఉంటుంది. అయితే ఈ కార్డులను ప్రస్తుతం హువావే మాత్రమే తయారు చేస్తోంది. ఈ కార్డుతో వచ్చిన తొలి ఫోన్లు ఇవే కావడం విశేషం. మేట్ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌లో 40వాట్ల సూపర్ చార్జింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. 0 నుంచి 70 శాతం వరకు చార్జింగ్ అయ్యేందుకు కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. అలాగే 15వాట్ల వైర్‌లెస్ క్విక్ చార్జింగ్‌కు కూడా ఈ ఫోన్‌లో సపోర్ట్‌ను అందిస్తున్నారు. మేట్ 20లో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ బ్యాటరీ 0 నుంచి 58 శాతం చార్జ్ అయ్యేందుకు 30 నిమిషాల సమయం పడుతుంది.

హువావే మేట్ 20 ప్రొ ఫీచర్లు...


6.39 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే
3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
హువావే కైరిన్ 980 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై
40, 20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3డీ ఫేస్ అన్‌లాక్
ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ
యూఎస్‌బీ టైప్ సి, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్

హువావే మేట్ 20 ఫీచర్లు...


6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే
2244 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
హువావే కైరిన్ 980 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్
128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
12, 16, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్
ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ
యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ చార్జింగ్

హువావే మేట్ 20 ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, బ్లాక్, ట్విలైట్ కలర్స్‌లలో విడుదల కాగా ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 799 యూరోలుగా (దాదాపుగా రూ.67,820) ఉంది. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 849 యూరోలు (దాదాపుగా రూ.72,070)గా ఉంది. హువావే మేట్ 20 ప్రొ ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, బ్లాక్, ట్విలైట్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్స్‌లలో విడుదల కాగా, ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 1049 యూరోలుగా ఉంది. అయితే ఈ ఫోన్లు యూకే, ఫ్రాన్స్, ఇటలీ, యూఏఈలలో ఇప్పటికే లభ్యమవుతున్నాయి. కానీ భారత్‌లో ఈ ఫోన్లను విడుదల చేసే తేదీలను ఇంకా వెల్లడించలేదు.

1745

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles