చిన్నారుల కోసం హువావే నుంచి రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లు..!


Thu,March 14, 2019 06:24 PM

మొబైల్స్ త‌యారీదారు హువావే చిన్నారుల కోసం రెండు నూత‌న స్మార్ట్‌వాచ్‌ల‌ను ఇవాళ విడుద‌ల చేసింది. హువావే కిడ్స్ వాచ్ 3, కిడ్స్ వాచ్ 3 ప్రొ పేరిట ఆ వాచ్‌లు విడుద‌ల‌య్యాయి. కిడ్స్ వాచ్ 3 లో 1.3 ఇంచ్ డిస్‌ప్లే, 4ఎంబీ ర్యామ్‌, 32 ఎంబీ రామ్‌, మీడియాటెక్ ప్రాసెస‌ర్‌, 0.3 మెగాపిక్స‌ల్ కెమెరా, ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ కనెక్టివిటీ, ఐపీ 67 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 2జీ, బ్లూటూత్ 4.0, వైఫై, 660 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 3 రోజుల బ్యాట‌రీ బ్యాక‌ప్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉన్నాయి.

కిడ్స్ వాచ్ 3 ప్రొ లో 1.4 ఇంచ్ డిస్‌ప్లే, ట‌చ్ స్క్రీన్‌, స్నాప్‌డ్రాగ‌న్ 2500 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌, 512 ఎంబీ రామ్‌, 5 మెగాపిక్స‌ల్ కెమెరా, ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ క‌నెక్టివిటీ, ఐపీ 67 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 4జీ ఎల్‌టీఈ, వైఫై, జీపీఎస్‌, 660 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 2 రోజుల బ్యాట‌రీ బ్యాక‌ప్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉన్నాయి. ఇక కిడ్స్‌వాచ్ 3 రూ.4,110 ధ‌ర‌కు ల‌భ్యం కానుండ‌గా, కిడ్స్ వాచ్ 3 ప్రొ రూ.10,205 ధ‌ర‌కు ఈ నెల 24వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది.

2694
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles