ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన హువావే ఎంజాయ్ 9 స్మార్ట్‌ఫోన్


Sat,December 15, 2018 02:07 PM

మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎంజాయ్ 9 ను తాజాగా చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 6.26 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉండగా, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌లో డెడికేటెడ్ మెమొరీ కార్డు స్లాట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాటరీని ఏర్పాటు చేశారు. మిడ్‌నైట్ బ్లాక్, అరోరా బ్లూ, కోరల్ రెడ్, అరోరా వయొలెట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ విడుదల కాగా దీనికి చెందిన 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.10,470 ధరకు ఈ నెల 17వ తేదీ నుంచి విక్రయించనున్నారు.

హువావే ఎంజాయ్ 9 ఫీచర్లు...


6.26 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

1845

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles