రూ.1699కే హువావే కొత్త స్మార్ట్‌బ్యాండ్


Tue,March 12, 2019 02:49 PM

మొబైల్స్ త‌యారీదారు హువావే.. రెండు నూత‌న స్మార్ట్‌బ్యాండ్ల‌ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. బ్యాండ్ 3ఇ, బ్యాండ్ 3 ప్రొ పేరిట ఈ స్మార్ట్‌బ్యాండ్లు విడుద‌ల అయ్యాయి. హువావే బ్యాండ్ 3ఇ లో 0.5 ఇంచ్ డిస్‌ప్లే, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, పెడోమీట‌ర్‌, స్లీప్ ట్రాక‌ర్‌, ఎక్స‌ర్‌సైజ్ ట్రాక‌ర్‌, సెడెంట‌రీ రిమైండ‌ర్‌, కాల్ అండ్ మెసేజ్ నోటిఫికేష‌న్‌, కాల్ రిజెక్ష‌న్‌, వాట‌ర్ అండ్ డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 77 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 14 రోజుల బ్యాట‌రీ బ్యాక‌ప్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

హువావే బ్యాండ్ 3 ప్రొ స్మార్ట్‌బ్యాండ్‌లో 0.95 ఇంచ్ ట‌చ్ డిస్‌ప్లే, 384 కేబీ ర్యామ్‌, 1 ఎంబీ రామ్‌, 16 ఎంబీ ఫ్లాష్ మెమొరీ, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, పెడోమీట‌ర్‌, స్లీప్ ట్రాక‌ర్‌, ఎక్స‌ర్‌సైజ్ ట్రాక‌ర్‌, సెడెంటరీ రిమైండ‌ర్, కార్డియో టాకోమీట‌ర్‌, కాల్ అండ్ మెసేజ్ నోటిఫికేష‌న్‌, వాట‌ర్ అండ్ డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 100 ఎంఏహెచ్ బ్యాట‌రీ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. కాగా హువావే బ్యాండ్ 3ఇ రూ.1699 ధ‌ర‌కు, బ్యాండ్ 3 ప్రొ రూ.4699 ధ‌ర‌కు త్వ‌ర‌లో వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానున్నాయి.

1051

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles