కొత్త ఫిట్‌నెస్ బ్యాండ్లు, ఫిట్ వాచ్‌ను విడుదల చేసిన హువావే


Tue,November 7, 2017 05:08 PM

హువావే సంస్థ 'బ్యాండ్ 2, బ్యాండ్ 2 ప్రొ' పేరిట రెండు కొత్త ఫిట్‌నెస్ బ్యాండ్లను, ఫిట్ పేరిట ఓ నూతన స్మార్ట్‌వాచ్‌ను ఇవాళ విడుదల చేసింది. రూ.4,599, రూ.6,999 ధరలకు ఫిట్‌నెస్ బ్యాండ్లు లభ్యమవుతుండగా, ఫిట్ వాచ్ రూ.9,999 ధరకు లభిస్తున్నది.
Huawei-Fit
హువావే విడుదల చేసిన బ్యాండ్ 2, బ్యాండ్ 2 ప్రొలలో పోలెడ్ డిస్‌ప్లే, యాక్టివిటీ ట్రాకర్, వాటర్ ప్రూఫ్ టెక్నాలజీ, ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, ఈ-మెయిల్స్, క్యాలెండర్ ఈవెంట్లు, వాట్సాప్ నోటిఫికేషన్లు, హార్ట్ రేట్ సెన్సార్, 100 ఎంఏహెచ్ బ్యాటరీ, 21 రోజుల బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఫిట్ వాచ్‌లో 1.04 ఇంచ్ డిస్‌ప్లే, 208 x 208 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 4.4, ఐఓఎస్ 8.0 డివైస్ కంపాటబులిటీ, హార్ట్ రేట్ సెన్సార్, యాక్టివిటీ ట్రాకర్, ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల నోటిఫికేషన్స్, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 80 ఎంఏహెచ్ బ్యాటరీ, 6 రోజుల బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

2062

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles