హువావే నుంచి ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్...


Mon,April 11, 2016 01:56 PM

హువావే సంస్థ తన నూతన ఆండ్రాయిడ్ వేర్ స్మార్ట్‌వాచ్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.22,999 ధరకు ఈ వాచ్ ఫ్లిప్‌కార్ట్ సైట్ ద్వారా వినియోగదారులకు లభిస్తోంది. స్త్రీ, పురుషులు ఇరువురు ధరించేందుకు వీలుగా దీన్ని వివిధ రకాల కలర్స్, స్టైల్స్‌లో రూపొందించారు. ఈ వాచ్ 1.4 ఇంచ్ అమోలెడ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 400 x 400 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 512 ఎంబీ ర్యామ్, 300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ వాచ్‌ను ఫుల్ చార్జ్ చేసేందుకు 75 నిమిషాల సమయం పడుతుంది. ఇందులో బిల్టిన్ మైక్రోఫోన్‌ను కూడా అందిస్తున్నారు.

6981

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles