హెచ్‌టీసీ యు19ఇ స్మార్ట్‌ఫోన్ విడుదల


Tue,June 11, 2019 07:52 PM

మొబైల్స్ తయారీదారు హెచ్‌టీసీ తన నూతన స్మార్ట్‌ఫోన్ యూ19ఇ ని ఇవాళ తైవాన్ మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.32,950 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు రేపటి నుంచి లభ్యం కానుంది. ఇందులో 6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 12, 20 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 24, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండింటిని ఏర్పాటు చేశారు.

హెచ్‌టీసీ యూ19ఇ ఫీచర్లు...


6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3930 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జ్.

3469
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles